మోహిని అందం – భస్మాసుర అంతం!

Source: మోహిని అందం – భస్మాసుర అంతం!

Advertisements

మోహిని అందం – భస్మాసుర అంతం!

ఆగ్రహం కలిగినప్పుడు ఎదుటి వారికి చెడు జరగాలని ఆదేశించడమే శాపం. అనుగ్రహం కలిగినప్పుడు ఎదుటి వారికి మంచి జరగాలని ఆశీర్వదించడమే వరం. శాపమిచ్చినప్పుడు శాపంగానూ, వరమిచ్చినప్పుడు వరంగానూ పనిచేయడం సహజం. కానీ ఒక్కోసారి వరాలు శాపాలుగా, శాపాలు వరాలుగా మారుతాయి. శాపం తిట్టులాంటిది. వరం దీవెన లాంటిది. చేసిన పాపానికి శిక్షగా విధించేది శాపం, పుణ్యానికి ప్రతిఫలంగా లభించేది వరం. పాపాలు శాపాలై కాటు వేస్తే, పుణ్యాలు వరాల హారాలై అలంకరిస్తాయి!

శ్రీ మహాభాగవత ఇతిహాసంలో మోహినీ అందానికి పరవశుడైన భస్మాసురుడు వరాన్ని, శాపంగా మార్చుకొన్న కథ

ప్రకారం భస్మాసురుడు శివుని భక్తుడు. అతను శివుడి నుండి వరం పొందడానికి గొప్ప తపస్సు చేసాడు. ఆ తపస్సు కారణంగా, మహాదేవుడు కరుణించి, ఒక వరం కోరుకొమ్మన్నాడు. భస్మాసురుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించమన్నాడు, కానీ శివుడు తనకు అమరత్వాన్ని ప్రసాదించే శక్తి లేదన్నాడు. అప్పుడు భస్మాసురుడు తన కోరుకున్న వరం పద్ధతిని మార్చుకున్నాడు. భాస్మసురుడి తలను తమ చూపుడు వేలుతో తాకితే, వెంటనే కాలిపోయి, బూడిద (భస్మ) అవుతాడు. శివుడు ఆ వరాన్ని ప్రసాదించాడు. భస్మాసురుడు చాలా సంతోషించి, అధిక సంతోషంతో, మహాదేవుడు ఇచ్చిన ఆ వరాన్ని తనమీద తనే పరీక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. వెంటనే, అతను తన బొటన వేలితో శివుని తలను తాకాలి అనుకున్నాడు. శివుడు కాలిపోయి, బూడిదైతే పార్వతిని చేపట్టాలి అనుకున్నాడు. శివుడు ఎక్కడికి వెళితే అక్కడికి భస్మాసురుడు అనుసరించాడు.

శివుడు విష్ణుమూర్తిని ఆశ్రయించి, ఆ పరిస్థితికి కారణమైన తనను ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి పరిష్కారం కోరాడు. మహావిష్ణు అతనికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడు.

క్షీరసాగర మధన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోరాడు కొనుచుండగా శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు.

ఆశ్చర్యంగా  మోహిని యొక్క అందమును చూసి భస్మాసురుడు వ్యామొహంలో పడిపోతాడు…అనాలోచితంగా

మోహితుడై ఎవరీ అందాల రాశి అని చూడ సాగాడు.

పాల’ మీగడ లాంటి అందం ఈమెది! ఎవరీ అద్భుత సౌందర్య రాశి? వివిధ  ఆకారాలలొ బారులు తీరి గూళ్ళు చేరుతున్న పక్షులు,  ఆకాసంలో సిందురంలా కనిపిస్తున్న సూర్యుడు, సంధ్యా  సమయమని పదే పదే గుర్తుచేస్తున్నాయి. అదేసమయములో పచ్చని పచ్చిక మీద  కొబ్బరిచెట్టు నీడలో   స్వేద తీరుతున్న అద్భుత సౌందర్య రాశి!

కొబ్బరి చెట్టుఆకుల  మధ్యనుండి వచ్చే సువర్ణచాయ నులివెచ్చని సూర్యకిరణాలు ఆమెకనులలో గుచ్చుకుంటుంటే, ఆమెకళ్ళు మిలమిలా ఆర్పుతుంటే ఆమెమోము వర్ణన తీతం. ఇంతలో సుర్యబింబానికి కాటుక దిద్దినట్లు కారుమబ్బులు  అలుముకున్నాయి  నింగిలో రంగులవిల్లు ఎక్కుపెట్టినట్లు ఇంద్రధనస్సు ఆకాశానికి   వన్నె తెచ్చింది. సంగీతంలా వినిపిస్తున్న పక్షుల కిలకిల రావాలు ,వెండి చినుకులవలె వర్షపు చినుకులు పడుతుంటే,

ఆనందంతో నెమళ్ళు పురివిప్పి సంగీతానికి తగినట్లుగా నాట్యం చేస్తున్నట్లుంది. అటుగావున్న కొలనులో పచ్చనితామరాకులు, వాటి మద్యలో రంగురంగుల కలువలు,వాటి మద్య ఖాళీలలో రంగు రంగుల చేపపిల్లలు ఆడుతున్న దృశ్యం ప్రకృతికే శోభ తెస్తున్నట్లుంది. పాదాల క్రింద పూలు నలిగిపోతాయా !  మెడ లోని చంద్ర హారం గుండె లకి తగులునా !

సుకుమార సుతి మెత్తని పాదాలు కంది పోతాయా ! అన్నట్లుగా మెల్లగా నడిచి వస్తున్న అందాలరాశి. చల్లని గాలికి ఎగురుతున్న నల్లని కురులు,  గట్లు తెంచుకున్న  నది పాయలవలె ప్రవహిస్తున్నాయి  చంద్రుని కాంతి ఆమె వజ్రపు ముక్కు పుడక పై పడి మోము  ప్రకాశంతో వెలిగిపోతుంది  ఆలకిస్తున్నట్లుగా ఊగుతూ  చెక్కిళ్ళను తాకుతున్న  లోలకలు.

మోహినీ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం క్రింద పడుతుంది. దాన్ని తీసుకొని మరిమోహితుడై  ఎదుటనున్న  మోహినితో “నిన్ను పెళ్ళి చేసుకుంటాను” అని భస్మాసురుడు అనగా అప్పుడు మోహిని “నాకు నాట్యం అంటే చాలా ఇష్టం కావున నాలాగ నాట్యం చేసిన వారినే పెళ్ళాడుతాను” అని అంటుంది. భస్మాసురుడు ఆ పందెమును అంగీకరించి నృత్యం మొదలుపెడతాడు….మోహిని అడుగులకు, అడుగులను కలిపాడు, నృత్యం చేసే సమయంలో, మోహిని తన బొటన వేలిని తన తలకు తాకే భంగిమ పెట్టింది. భస్మాసురుడు ఆమెను అనుసరించాడు, అతను తన బొటన వేలిని తన తలపై ఆంచాడు, వెంటనే శివుని వరప్రభావము వలన భస్మాసురుడు భస్మమైపోతాడు.

ప్రీతి మీద అనురక్తితో ఉండే మానవులు ఎలా బంధానికి గురవుతున్నావిషయంలో శంకరులు వివేకచూడామణి( 78 ) లో ఇలా విశ్లేషించారు

శబ్దాదిభిః పంచభిరేవ పంచ

పంచత్వమాపుః స్వగుణేన బధ్ధాః

కురంగ మాతంగ పతంగ మీన

భృంగా నరః పంచభిరంచితః కిమ్”

లేడి అతివేగంగా పరుగుతీయగలిగేదైనా, స్వభావసిద్ధంగా దానికున్న శబ్దప్రీతిచేత, వేణువు శబ్దానికి తన్మయత్వంతో నిశ్చలంగా ఉండిపోతుంది. అందుకే వేణువును ఊది, ఈ ఉపాయంతో బోయవాడు లేడిని బంధిస్తాడు. ఇలా లేడి శబ్దప్రీతితో బంధానికి చిక్కుకుంటోంది. ఏనుగు బలమైనదే. అరణ్యంలో స్వేచ్ఛగా తిరుగుతూంటుంది. అంతటి బలమైన ఏనుగూ స్పర్శప్రీతివల్ల, ఆడ ఏనుగును ఎరగా చూపి ప్రలోభపెట్టి దాన్ని బంధించడం చేస్తుంటారు.మిడుత అగ్నియొక్క ప్రకాశానికి రూపప్రీతివల్ల, అగ్నివేపుకి ఆకర్షించబడి అగ్నికి ఆహుతి అవుతుంది.చేప రుచికి ప్రలోభపడి రసప్రీతిచేత గాలానికి గ్రుచ్చే మాంసానికి ఆకర్షించబడి ఎరకు చిక్కుకుంటుంది.భ్రమరం (తుమ్మెద) సంపంగి పుష్పపు (చంపక పుష్పం) సువాసనకు, దానికిగల స్వభావసిద్ధమైన గంధప్రీతిచేత ఆకర్షించబడి, పుష్పాన్ని చేరాలనే కఠినతాపత్రయంలో సాటి భ్రమరములతో ఉండే పోరాటంలో ఇది నశిస్తుంది.

అంచేత కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించకపోతే, ఈ ప్రపంచంలోనే గాకుండా మరుజన్మలోనూ దుఖాన్ని అనుభవించాలి గదా! అందుకే శమదమాలను ఆచరిస్తూ మనస్సును, ఇంద్రియాలను జాగరూకతతో ఎప్పటికప్పుడు నియంత్రించడమే దీన్లో సాధన అంటారు….శివకిషెన్ జీ

Image

Literary Contributions of Sivkishen Ji

Sivkishen Ji, Matchless Author of Mythological and Historical Epics!  He published his works as Amazing Vedic Wisdom Series anad are Kingdom of Shiva, Shiva Samrajyam, Mysterious Kailash, Vedic Spaceships, ‘The King Yayati’, Rigvedic Legendary Battles, Quest of Olympias and Vedic Vaimānika. These series are full of incredibly mind-blowing Mythological and Historical Epic Stories. Explore  from these Works Vedic Science, Philosophy, and Spiritual Wisdom that are hard to decode embedded in Vedas. This is a perfect blend of dharma, karma, divinity, belief, philosophy, literature, science, mathematics, technology, social sciences, morals, etc. with many scientific theories explained unfolding myths and mysteries!

These are fascinating series full of incredibly mind-blowing Stories! Authentically spellbinding on script level by Sivkishen Ji … great reading… hard to put down.
These Books are now available on Amazon. Shop at Amazon.com..Read and awaken insights to perform better to the organization, society, and family!
Never ever suppress your likeness. Spread the cheer around! Life is too short to lock away happiness inside yourself!

The quest for Immortality!

The scripting of work “The King Yayati “reveals the differences between the Quests for Immorality and Immortality and reiterates the concept dealt in Rig Veda V11. 8.4 “The Quest for Immorality leads to Doom unless Lust is conquered” in an interesting story form and gives simple solutions for rising above the desires of lust, anger, and greed… Read the King Yayati…..Sivkishen, Author

sivkishen

The King Yayati

This epic research work lucidly details the story of the King Yayati as one of the most intriguing and fascinating episodes of Mahabharata. This explains on the spiritual journey of a King Yayati, who was engaged in religious activities and dictated as per Dharma.

The story of King Yayati brings us five of the most memorable characters of the epic Mahabharata. Yayati was a Puranic king and the son of King Nahusha and Ashokasundari. He was one of the ancestors of Pandavas and Kauravas belong.  He married seductively beautiful Devayani, who was the darling daughter of Asura Guru Shukracharya and Brahmavadini Urjaswathi. Kacha was son of Brihaspati who became the disciple of Shukracharya. The teenage Devayani fell in love with Kucha, who was sent to learn Mrita Sanjivani Mantra from the Asura Guru Shukracharya. After learning the divine mantra he refused to marry Devayani though he fell in…

View original post 767 more words